గ్రూప్-1 అభ్యర్థుల పై లాఠీ ఛార్జ్.. తీవ్రస్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్

by Mahesh |   ( Updated:2024-10-18 12:22:31.0  )
గ్రూప్-1 అభ్యర్థుల పై లాఠీ ఛార్జ్.. తీవ్రస్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన రోజు రోజు ఎక్కువ అవుతుంది. ఈ నెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని, గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠిచార్జ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన గ్రూప్స్ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని, గ్రూప్‌-1 అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని, న్యాయం కోరితే రక్తం కళ్ల చూస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు.. జీవో 29 గొడ్డలిపెట్టు అని బండి సంజయ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed