మునగ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం

by Sridhar Babu |
మునగ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం
X

దిశ, కొత్తగూడెం : మునగ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోలా పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్, చేపల పెంపకం, పుట్టగొడుగుల పెంపకంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, ఈసీఎస్ లతో ఐడీఓసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తే ఎకరానికి రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు మాత్రమే ఆదాయం లభిస్తుందన్నారు.

మునగసాగు ఎందుకు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎండాకాలంలో పొలాలు ఖాళీగా ఉంటాయని, ఇప్పుడు వచ్చిన పంట డబ్బుల నుంచి కేవలం 10 వేల రూపాయల పెట్టుబడి, రూ. 2 వేల విలువైన విత్తనాలు, రూ. 2 వేలు ప్లాస్టిక్ బ్యాగులకు ఖర్చు పెడితే ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటించనున్నట్టు చెప్పారు. ఒకవేళ రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు లేనట్లయితే కార్డ్ ఇప్పించాలని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో మునగాకు పొడి ధర కేజీ వెయ్యి రూపాయలు ఉందని అన్నారు. మొదటి విడతలో జిల్లాలో పదివేల ఎకరాలు మునగ సాగు చేపట్టే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు లోగా మొదటి విడత సాగు చేసే రైతులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed