Google New Chief Technologist: గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్‌ నియామకం

by Maddikunta Saikiran |
Google New Chief Technologist: గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ప్రభాకర్ రాఘవన్‌ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్(Google) కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్‌(New Chief Technologist)గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్‌(Prabhakar Raghavan) నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్(Google CEO Sundar Pichai) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా గూగుల్ సంస్థకు రాఘవన్ చేసిన సేవలను గుర్తుచేస్తూ పిచాయ్ కొనియాడారు. మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ(Microsoft, OpenAI) వంటి టెక్ ప్రత్యర్థుల నుంచి పెరుగుతున్న పోటీని పరిష్కరించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా రాఘవన్ ప్రస్తుతం గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, యాడ్స్, కామర్స్, పేమెంట్స్​ వంటి విభాగాలకు సీనియర్​ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రభాకర్ రాఘవన్ ఎవరు..?

ఇండియాలో పుట్టి పెరిగిన ప్రభాకర్ రాఘవన్ 1981లో మద్రాసులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Madras IIT) నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్(B.Tech) పూర్తి చేశారు. ఆ తర్వాత 1982లో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎమ్మెస్సీ(Msc) పట్టా పొందారు. 1986లో యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ(Ph.D) పూర్తి చేశారు.

ఆయన 2012లో గూగుల్‌లో చేరడానికి ముందు యాహూ(Yahoo)లో పనిచేశారు. అక్కడ సెర్చ్​, యాడ్ ర్యాంకింగ్, మార్కెట్​ప్లేస్​ డిజైన్​లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే IBMలో 14 సంవత్సరాల పాటు పని చేశారు. ఆ తర్వాత గూగుల్​లో చేరిన ఆయన స్మార్ట్​ 'రిప్లై అండ్ స్మార్ట్​ కంపోజ్' వంటి ఏఐ ఫీచర్స్​ ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్‌ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలోనే లెన్స్‌లో ఎఐ ఓవర్‌వ్యూస్(AI overviews), సర్కిల్ టు సెర్చ్(Circle to search), షాప్ వాట్ యూ సీ(Shop What You See) వంటి ముఖ్యమైన ఫీచర్‌లు ప్రారంభమయ్యాయి. కాగా ప్రస్తుతం ఆయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమితులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed