Airline services: వారానికి 25,007 విమాన సర్వీసులు.. శీతాకాల షెడ్యూల్ ప్రకటించిన డీజీసీఏ

by Maddikunta Saikiran |
Airline services: వారానికి 25,007 విమాన సర్వీసులు.. శీతాకాల షెడ్యూల్ ప్రకటించిన డీజీసీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శీతాకాలపు విమానాల షెడ్యూల్‌(Winter Flight Schedule)ను ప్రకటించింది. ఈ వింటర్ షెడ్యూల్​లో దేశంలోని 124 విమానాశ్రయాల(124 Airports) నుండి వారానికి 25,007 విమాన సర్వీసులు(Airline services) బయలుదేరడానికి విమానయాన సంస్థలకు డీజీసీఏ అనుమతించింది. ఇది ప్రస్తుత వేసవి షెడ్యూల్‌(Summer schedule)తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ. భారతీయ విమానయాన సంస్థలు వేసవి షెడ్యూల్​లో 125 విమానాశ్రయాల నుంచి 24,275 విమాన సర్వీసులను నడిపాయి. ఇక గతేడాది శీతాకాల షెడ్యూల్‌తో పోలిస్తే ఈ సారి విమానాల సంఖ్య 5.37 శాతం పెరిగింది. ప్రస్తుత శీతాకాలపు షెడ్యూల్ అక్టోబర్ 27న ప్రారంభమై మార్చి 29, 2025 వరకు కొనసాగుతుందని డీజీసీఏ తెలిపింది.

షెడ్యూల్ ప్రకారం, ఇండిగో(Indigo) వారానికి 13,691 విమానాలను నడపబోతుంది. ఆ తర్వాత టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా(Air India) 2,586 విమానాలను నడపబోతుంది. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్(Air India Express) 2,832, విస్తారా(Vistara) 2,193 , స్పైస్‌జెట్(Spicejet) 1,297, ఆకాశ ఎయిర్(Akasa Air) 989 విమానాల సర్వీసులను నిర్వహిస్తాయి. కాగా అతితక్కువగా అలయన్స్ ఎయిర్(Alliance Air) వారానికి 673 విమానాలను నడపబోతుంది.

Advertisement

Next Story

Most Viewed