మూసీ నిర్వాసితులకు రిహబిటేషన్ చేస్తాం: మంత్రి దామోదర

by Mahesh |
మూసీ నిర్వాసితులకు రిహబిటేషన్ చేస్తాం: మంత్రి దామోదర
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నిర్వాసితులను రీ హబిటేషన్ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ..ప్రతిపక్షాల మాటలను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. పేద ప్రజల మేలు కోసం చేస్తున్న ప్రోగ్రాం‌ను కూడా రాజకీయం చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన ద్వారా నష్టపోయిన బాధితులందరికీ అదుకుంటామన్నారు. ప్రకృతినీ కాపాడుకుంటామని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ గాలి మాటలు, అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్మెంట్ ప్రభుత్వాలకు ఉండాలన్నారు. చెరువులు, నదులను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. 2016 లో మూసీ రివర్ డెవలప్ బోర్డు ను తీసుకువచ్చి బౌండ్రిస్ ను కూడా నిర్ణయించారన్నారు. కానీ ప్రాజెక్టును ముందుకు తీసుకు పోలేదన్నారు. తమ ప్రభుత్వం ప్రజల కోణంలోనే ఆలోచించి, వాళ్ల ఆరోగ్యం, సంక్షేమం దృష్టిలో పెట్టుకొని మూసీ నదిలోని ప్రజలను షిఫ్ట్ చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వబోతున్నామన్నారు.

మూసీ పక్కన జీవించే ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకూడదనేది తమ లక్ష్యం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఇక ఓవర్ నైట్ లో డెవలప్ మెంట్ సాధ్యం కాదని, ఒక్కోక్కటి ఫర్ పెక్ట్ ప్లానింగ్ తో ముందుకు తీసుకువెళ్తామన్నారు. గతంలో 14 గ్రామాలు మల్లన్న సాగర్ లో మునిగిపోయాయని, భూ నిర్వాసితులకు న్యాయం చేయలేదన్నారు. ప్రశ్నించినోళ్లపై పోలీసులు జులుం, లాఠీ చార్జీలు, 144 సెక్షన్ ఆంక్షలు వంటివి పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు అనాడు స్వయంగా తానే అడ్వకేట్లను పెట్టి కోర్టులలో ఫైట్ చేశానన్నారు. బీఆర్ ఎస్ ఇక నైన అబద్ధాలు బంద్ చేయాలన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లలో రియల్ ఎస్టేట్ ఎలా సాగిందో? ప్రజలందరికీ తెలుసునని వివరించారు. కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి రుణాలు ఎలా తీసుకున్నారో? ప్రజలందరికీ స్పష్టంగా అవగాహన ఉందన్నారు. దొంగ లెక్కలు చెప్పి, ప్రజలను ఇప్పటికీ మభ్యపెట్టాలని చూడొద్దని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed