Infinix Zero Flip: ఇన్‌ఫినిక్స్‌ నుంచి తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు,సేల్ వివరాలు ఇవే..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-18 17:28:06.0  )
Infinix Zero Flip: ఇన్‌ఫినిక్స్‌ నుంచి తొలి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు,సేల్ వివరాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోల్డబుల్ ఫోన్ల(Foldable phones)కు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఈ తరహా మొబైల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌(Infinix) తన మొట్టమొదటి ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్(Indian Market) లోకి విడుదల చేసింది. ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్(Infinix Zero Flip) పేరుతో ఈ కొత్త ఫోన్(New Phone)ను పరిచయం చేసింది. దీని ధరను రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మొబైల్ బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్(Blossom Glow, Rock Black) కలర్‌లో లభిస్తుంది. ఇండియాలో ఈ ఫోన్ సేల్ అక్టోబర్ 24 నుండి ప్రారంభం కానుంది. కస్టమర్లు దీనిని ఫ్లిప్‌కార్ట్(Flipkart) నుండి కొనుగోలు చేయవచ్చు. ఎస్​బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌(SBI Credit, Debit Card) ద్వారా కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.5,000 తగ్గింపును పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఇన్‌ఫినిక్స్‌ జీరో ఫ్లిప్ 5G స్పెసిఫికేషన్ల వివరాలు..

  • 6.9-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+LTPO అమోలెడ్
  • మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5పై పనిచేస్తుంది.
  • 120 HZ స్క్రీన్ రిఫ్రెష్‌ రేట్
  • ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది.అలాగే సెల్ఫీల కోసం 50 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. 4K వరకు వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు.
  • 70W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 4720mAh బ్యాటరీని కలిగి ఉంది.
Advertisement

Next Story

Most Viewed