MK Stalin: గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్

by S Gopi |
MK Stalin: గవర్నర్ ఆర్ఎన్ రవిని రీకాల్ చేయాలని డిమాండ్ చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య మరోసారి వివాదం నెలకొంది. తాజాగా చెన్నైలో జరిగిన దూరదర్శన్‌ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమంలో హిందీ మాసోత్సవం నిర్వహించారు. అయితే, ఈ వేడుకల్లో ఆలపించిన రాష్ట్ర గీతంలో 'ద్రవిడ' పదాన్ని ఉద్దేశపూర్వకంగా పలకలేదని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ప్రవర్తించిన కారణంగా గవర్నర్‌ను తక్షణం రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి లేఖ కూడా పంపారు. మొదట హిందీ, హిందీ భాషేతర రాష్ట్రాల కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించడంపై సీఎం స్టాలిక్ విమర్శలు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర గేయం ఆలపించే సమయంలో ద్రవిడ పదాన్ని గాయకులు పలక్కపోవడం రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ స్పందిస్తూ, గాయకులు పొరపడ్డారని చెబుతూ క్షమాపణలు చెప్పింది. గవర్నర్ సైతం ద్రవిడ పదాన్ని పలక్కపోవడంపై స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరించిన కారణంగా గవర్నర్ పదవికి అర్హులు కాదన్నారు. ఇది చట్టరీత్యా కూడా నేరమని, జాతీయ గీతంలో ద్రవిడ పదాన్ని కూడా అలాగే ఉచ్చరించకుండా దాటవేస్తారా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా తమిళనాడు ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు గవర్నర్‌ను రీకాల్ చేయాలన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ కార్యాలయం.. ఇందులో ఆర్ఎన్ రవి తప్పు లేదని, కార్యక్రమంలో హాజరైన బృందం పొరపాటు చేసిందని ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed