- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గూగుల్ ఉద్యోగుల కోసం ఉచిత భోజనం ఎందుకు అందిస్తుంది? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి?
దిశ, ఫీచర్స్ : గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో ఉద్యోగుల ప్రోత్సాహకాల గురించి చర్చించాడు. ఈ క్రమంలో అసలు గూగుల్ ఎంప్లాయీస్ కు ఉచిత భోజన సదుపాయం ఎందుకు అందిస్తుందో అసలు సీక్రెట్ బయటపెట్టాడు. సంస్థకు సంబంధించిన సందడిగా ఉన్న కేఫ్ లలో జరిగే అనధికారిక చర్చల నుంచి వినూత్న ఐడియాలు పుట్టుకొస్తాయని.. స్వయంగా తాను ఎక్స్ పీరియన్స్ చేశానని చెప్పాడు. క్రియేటివ్ ఆలోచనల్ని పెంచుతుందని.. సొసైటీని నిర్మిస్తుందని వివరించాడు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రయోజనాలను, చొరవలను పరిచయం చేయడం ద్వారా వర్క్ ప్లేస్ డైనమిక్స్ పై ఎఫెక్ట్ ఉంటుందని.. ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని తెలిపాడు.
కాగా 1,82,000 మంది ఉద్యోగులను కలిగి గూగుల్ భారీ బెనిఫిట్స్ తో మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ను ఆకర్షిస్తూనే ఉంది. ఉద్యోగులు వెల్‌నెస్ ప్రోగ్రామ్స్, ఆన్-సైట్ ఫిట్‌నెస్ సెంటర్‌లతో పాటు మెడికల్, డెంటల్, విజన్ కవరేజీని కలిగి ఉన్న సమగ్ర ఆరోగ్య బీమాను కూడా ఆనందిస్తున్నారు. కంపెనీ పోటీ వేతనాలు, పదవీ విరమణ ప్రణాళికలు, స్టాక్ ఎంపికలు, ఆర్థిక ప్రణాళిక సేవలను కూడా అందిస్తుంది. సౌకర్యవంతమైన వర్కింగ్ హవర్స్, రిమోట్ వర్క్ చాయిస్, మెటర్నిటీ అండ్ పెటర్నిటి లీవ్స్, ట్యూషన్ రియంబర్స్ మెంట్ ద్వారా వ్యక్తిగత వృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది.