పిల్లలు తల్లిదండ్రులను ఈ విషయాల్లో రహస్యంగా గమనిస్తారు..

by Sujitha Rachapalli |
పిల్లలు తల్లిదండ్రులను ఈ విషయాల్లో రహస్యంగా గమనిస్తారు..
X

దిశ, ఫీచర్స్ : పిల్లలు తమ పరిసరాల నుంచి నిత్యం నేర్చుకుంటారు. తల్లిదండ్రులే వారి ఫస్ట్ రోల్ మోడల్స్. కాగా ఎప్పుడు మీపట్ల అటెన్షన్ తో ఉంటారు. మీ ప్రవర్తన, వైఖరి, ప్రతిచర్యలు గమనిస్తుంటారు. కాగా పేరెంట్స్ లో పిల్లలు రహస్యంగా గమనించే విషయాల గురించి వివరిస్తున్నారు నిపుణులు.

ఇతరులతో వ్యవహరించే విధానం

కుటుంబ సభ్యుల నుంచి అపరిచితుల వరకు అందరితో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారో పిల్లలు గమనిస్తారు. దయ, గౌరవం, అసహనం వంటి చర్యలను గమనిస్తారు. ఈ ప్రవర్తనలను వారు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇతరులతో మీ పరస్పర చర్యల గురించి జాగ్రత్త వహించడం.. పిల్లల్లో సానుభూతి, సామాజిక నైపుణ్యాలను పెంపొందించడానికి బలమైన ఉదాహరణను సెట్ చేయవచ్చు.

సెల్ఫ్ కేర్ హ్యాబిట్స్

మీరు మీ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారా.. అంటే అభిరుచులలో పాల్గొనడం లేదా స్వీయ సంరక్షణ కోసం చర్యలు తీసుకోవడం వంటివి పిల్లలు గమనిస్తారు. మీరు సెల్ఫ్ కేర్ కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూడటం ద్వారా.. వారి స్వంత శ్రేయస్సును చూసుకోవడం, పాజిటివ్ సెల్ఫ్

ఇమేజ్ పెంపొందించుకోవడం చాలా అవసరమని తెలుసుకుంటారు.

ఆరోగ్యం, ఫిట్ నెస్

మీరు మీ శరీరాన్ని ఎలా చూసుకుంటారో పిల్లలకు తెలుసు. మీరు వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చినా, పౌష్టికాహారం తీసుకున్నా, భోజనం మానేసి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేసినా.. వారు ఈ అలవాట్లను గ్రహిస్తారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి వారు కూడా పెరిగేకొద్దీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారు.

వివాదాల పరిష్కారం

తల్లిదండ్రులు వాదించినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. విభేదాలు అరవడం లేదా గౌరవప్రదమైన సంభాషణలతో పరిష్కరించబడతాయా అనేది గమనిస్తారు. ఆరోగ్యకరమైన పరిష్కార పద్ధతులను ప్రదర్శించడం పిల్లలకు సంబంధాలలో కమ్యూనికేషన్, రాజీ ప్రాముఖ్యతను బోధిస్తుంది.

ఒత్తిడి నిర్వహణ

తల్లిదండ్రుల భావోద్వేగ స్థితుల విషయానికి వస్తే పిల్లలు చాలా అవగాహన కలిగి ఉంటారు. ఒత్తిడికి ఎలా స్పందిస్తారో గమనిస్తారు, ఓపికతో లేదా నిరాశతో ఉంటున్నారా చూస్తారు. పిల్లలు తరచుగా ఈ ప్రతిస్పందనలను అనుకరిస్తారు కూడా. కాబట్టి ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించడం వంటి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్‌లను ప్రదర్శించడం ద్వారా వారి స్వంత భావోద్వేగాలను ఎలా నిర్వహించాలో వారికి నేర్పించవచ్చు.

మనీ మ్యాటర్స్

మీరు ఆర్థిక సమస్యల గురించి బహిరంగంగా చర్చిస్తున్నా లేదా బడ్జెట్‌ను ప్రాక్టీస్ చేస్తున్నా.. పిల్లలు డబ్బు పట్ల మీ వైఖరిని గమనిస్తారు. ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. కాబట్టి పొదుపు, బడ్జెట్ వంటి బాధ్యతాయుతమైన అలవాట్లను ప్రదర్శించడం.. వారిలో సానుకూల ఆర్థిక విలువలను పెంపొందించడంలో సహాయపడుతుంది.

Advertisement

Next Story

Most Viewed