- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: మంత్రి పొంగులేటికి అభినందనల వెల్లువ
దిశ, తెలంగాణ బ్యూరో: శాసనసభలో శనివారం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేదని బులిటెన్ విడుదల చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యే అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చను కొనసాగించారు. చర్చలో అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు. భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విపక్ష సభ్యులు అభినందించారు. మండలిలో శనివారం పలు బిల్లులకు ఆమోదం తెలుపనుంది. మండలిలో జీహెచ్ఎంసీ బిల్లు, తెలంగాణ మున్సిపల్ బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) చట్టం- 2024 బిల్లు, భూభారతి నాలుగు బిల్లులకు శనివారం ఆమోదం తెలుపున్నారు.
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ, మండలి సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఆతర్వాత వాయిదా వేసి ఈ నెల 16 నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీతో ముగియనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 7 రోజుల పాటు కొనసాగాయి. అయితే ప్రధానప్రతిపక్షం మాత్రం ప్రతి రోజూ ఒక అంశంపై వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అధికారకాంగ్రెస్ పార్టీ మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తూ సభను కొనసాగించింది. సభ్యుల నిరసనల మధ్యే ఒక వైపు బిల్లులు ఆమోదం తెలుపుతూ ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, మరోవైపు చర్చలను కొనసాగించింది. ప్రధానప్రతిపక్షం నిరనసలు చేసినా సస్పెండ్ చేయకుండా సభను కొనసాగించడం విశేషం.