Formula E-Race: కేటీఆర్‌కు కాదు, ఏసీబీకి ఊరట.. అడ్వకేట్ వర్మ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-12-20 15:50:34.0  )
Formula E-Race: కేటీఆర్‌కు కాదు, ఏసీబీకి ఊరట.. అడ్వకేట్ వర్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ-రేస్(Formula E-Race) విషయంలో అవకతవకలు జరిగాయని, అరెస్ట్ చేయోద్దు అన్నందుకే కేటీఆర్(KTR) కు ఊరట లభించినట్లు కాదని అడ్వకేట్ వర్మ(Advocate Varma) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్(BRS) హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారని తెలిపారు. ఇందులో కేటీఆర్ చాలా అవకతవకలకు పాల్పడ్డట్లు ఏసీబీ(ACB) కేసు(Case) నమోదు చేసిందని, తర్వాత కూడా తమ ప్రభుత్వమే వస్తుందని.. ఏమైనా చేయొచ్చు అన్నట్లు కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు.

ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాక విచారణ జరుగుతుందని, కానీ ముందు వాళ్లే తమని అరెస్ట్ చేస్తారని భయపడి కోర్టుకు వెళ్లారని అన్నారు. అయితే ఈ కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలని కోర్టు ఆదేశించిందని, అంతమాత్రాన కేటీఆర్ కు ఊరట లభించినట్లు కాదని, ఏసీబీకి ఊరట లభించినట్లు అయ్యిందని స్పష్టం చేశారు. ఇందులో ఏసీబీకి ఇంకా కోర్టు నెమ్మదిగా విచారణ జరుకోండి సమయం ఇచ్చినట్లు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉన్నదని, ఏసీబీకి పది రోజుల సమయం దొరికిందని, ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అడ్వకేట్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed