ఇక మున్సిపాలిటీగా అశ్వారావుపేట

by Sridhar Babu |
ఇక మున్సిపాలిటీగా అశ్వారావుపేట
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం మున్సిపాలిటీగా మారనుంది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడనున్న 12 మున్సిపాలిటీలలో అశ్వారావుపేట ఉంది.

దీంతో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవ్వనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మార్గదర్శకాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. అసెంబ్లీలో ప్రకటన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో అశ్వారావుపేట మున్సిపాలిటీగా మార్పు ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దగ్గరుండి పర్యవేక్షించినట్లు తెలిసింది. కానీ ఎమ్మెల్యే వర్గాల నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.

Advertisement

Next Story

Most Viewed