Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ ఒక ఉగ్రవాది: కెనడా ప్రతిపక్ష నేత

by S Gopi |
Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ ఒక ఉగ్రవాది: కెనడా ప్రతిపక్ష నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్నేళ్ల నుంచి చోటుచేసుకుంటున్న సంఘటనల కారణంగా భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేక ప్రతికూల మలుపులను తీసుకున్నాయి. గతేడాది జూన్‌లో కెనడాలోని సర్రెలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపు దెబ్బతిన్నాయి. ఈ సంఘటన చుట్టూ ఉన్న వివాదానికి తోడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత, - ఆ దేశ ప్రతిపక్ష నేత మాక్సిమ్ బెర్నియర్ నిజ్జర్‌కు.. ఎలాగో 2007లో కెనడియన్ పౌరసత్వం మంజూరు అయిపోయింది. అయినప్పటికీ అతను 'విదేశీ ఉగ్రవాది' అని అన్నారు. నిజ్జర్ 1997 నుంచి కెనడాలో ఆశ్రయం పొందేందుకు అనేకసార్లు మోసపూరిత డాక్యుమెంట్లు ఉపయోగించిన విదేశీ ఉగ్రవాది. పలుమార్లు తిరస్కరించబడినప్పటికీ, అతను దేశంలో కొనసాగాడు. ఇది అడ్మినిస్ట్రేటివ్ పొరపాటుగా మాక్సిమ్ పేర్కొన్నారు. తప్పుడు పత్రాలను వాడిన వేలాది మంది వ్యక్తులతో పాటే నిజ్జర్‌ను కూడా పంపించేయాల్సిది. ఇదే సమయంలో కెనడాలో నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తున్నారని భారత దౌత్యవేత్తలపై వచ్చిన ఆరోపణలపై మాక్సిమ్ స్పందించారు. అవి నిజమని తేలితే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఋజువులు లేవని మాక్సిమ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed