Dirty Love: నంది అవార్డు గ్రహీత దర్శకత్వంలో ‘డర్టీ లవ్’

by sudharani |
Dirty Love: నంది అవార్డు గ్రహీత దర్శకత్వంలో ‘డర్టీ లవ్’
X

దిశ, సినిమా: ప్రజెంట్ జనరేషన్‌లో లవ్ (love) అనే పదానికి అర్థమే లేకుండా పోతుంది. ప్రేమ (love) ముసుగులో చాలా మంది మోశాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా.. ‘డర్టీ లవ్’ (Dirty Love) పేరిట ప్రైవేట్ రూముల్లో శృంగారంతో, రేవ్ పార్టీల్లో విలాసాలతో, పబ్బుల్లో జల్సాలతో యువత రెచ్చిపోతున్నారు. తాగుతూ తూలుతూ చిందులు వేస్తున్నారు. ఇలా యువత మత్తులో ఎలా తూగుతున్నారో తెలిపే చిత్ర కథతో A2B ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ‘డర్టీ లవ్’ (Dirty Love) చిత్రం రూపొందించనుంది. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ (Karri Balaji) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానని రంజిత్ రావు (Ranjit Rao) నిర్మించబోతున్నారు. ఇప్పటికే ‘డర్టీ లవ్’కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి కాగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రానికి కొత్త కథానాయకుడు, నాయికల కోసం అన్వేషిస్తున్నారు. ప్రముఖ నటీ నటులు, సాంకేతిక నిపుణులుతో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ (Regular Shooting) త్వరలో మొదలవుతుందని ప్రకటించింది చిత్ర బృందం.

Advertisement

Next Story

Most Viewed