- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి.. సీఎం కేసీఆర్‌పై గరం గరం!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మేనిఫెస్టోని ఇవాళ గులాబి బాస్ కేసీఆర్ ప్రకటించారు. మానిఫెస్టోలో రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, జర్నలిస్టులు ఇలా అన్ని వర్గాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్త పథకాలు, హామీలు పొందుపరిచారు. అయితే ఈ సారి తెలంగాణ నిరుద్యోగులు, యువతకు మేనిఫెస్టోలో ఎలాంటి హామీ పోందుపర్చినట్లుగా కనిపించడం లేదు. మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగాల గురించి చెప్పలేదు. మరోవైపు గతంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిపై నేడు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.
విద్యకు లేని ప్రాధాన్యత..
మరోవైపు విద్యకు కూడా పెద్ద ప్రాధాన్యత ఇవ్వనట్లుగా కన్పిస్తోంది. కేవలం అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. గులాబీ బాస్ కేసీఆర్ మేనిఫెస్టోలో నిరుద్యోగులపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 200 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన ప్రతీ నోటిఫికేషన్లో ఏదో ఒక గందరగోళం ఉండడంతో నిరుద్యోగులు కూడా ఇప్పటికే కేసీఆర్ పై కోపంగా ఉన్నారు.
ఈ రోజు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై కూడా నిరుద్యోగులు స్పందించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగులకు మొండిచేయే మిగిలిందని మండిపడ్డారు. ఎంతమంది నిరుద్యోగులు చనిపోయిన పరవాలేదని ఈ కేసీఆర్‌కు అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం బాగుంటే చాలు.. కానీ మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని వాపోయారు. నిరుద్యోగులను మరిచిన కేసీఆర్‌కు ఓటుతోనే బుద్దిచెబుతామని నిరుద్యోగులు మండిపడుతున్నారు.