- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక రీచ్ లనుండే ఇసుక రవాణా చేసుకోవాలి : జగిత్యాల కలెక్టర్
దిశ,జగిత్యాల కలెక్టరేట్ : అందుబాటు ధరలో ప్రజలకు ఇసుక సరఫరా చేయాలని ఇందు కోసం అవసరం అయ్యే ఇసుక రీచ్ లను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో నిర్మాణ అవసరం కోసం అందుబాటు ధరలో ఇసుక సరఫరా చేయడానికి రాయికల్ మండలంలో ఇటిక్యాల, మెట్పల్లి మండలంలో ఆత్మకూరు, కోరుట్ల మండలంలో పైడిమడుగు, కథలాపూర్ మండలంలో ఈ కొండ గ్రామాలలో ఇసుక రీచ్ లను గుర్తించడం జరిగిందని, ఒక ట్రాక్టర్ (మూడు) క్యూబిక్ మీటర్లకు గాను ఎనిమిది వందల రూపాయలు ధర నిర్ణయించడం జరిగిందని, కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రజలు వారి అవసరాల నిమిత్తం సంబంధిత తహసీల్దార్ ను సంప్రదించి ఒక్క ట్రాక్టర్ (3) క్యూబిక్ మీటర్లకు (ఎనిమిది వందలు) డీడీ రూపంలో చెల్లించి తగిన అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేసుకోగలరని సూచించారు.
అంతేకాకుండా జిల్లాలో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకే ఇసుక రవాణా చేయాలని సెలవు దినాల్లో ఇసుక రవాణా చేయకూడదని ఆయన సూచించారు. ట్రాక్టర్ యజమానులు ఈ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం చే నిర్దేశించబడిన రీచ్ నుంచి తహసీల్దార్ అనుమతి పత్రం తీసుకున్నాకే ఇసుక రవాణా చేయాలని ఆయన అన్నారు. ట్రాక్టర్ల యజమానులు నిబంధన ప్రకారం ఇసుక రవాణా చేయాలి అలా కాకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే, మొదటిసారిగా పట్టుబడితే రూ.ఇరవై ఐదు వేలు,రెండోసారి పట్టుబడితే రూ. యాభై వేలు జరిమానా విధించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు, జిల్లా ప్రజలు ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన ఇసుకను మాత్రమే రవాణా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రజలను కోరారు.