- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యం.. రాష్ట్ర వ్యాప్తంగా యూడీఏల ఏర్పాటు
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఖజానాలో నిధుల్లేక రాష్ట్ర సర్కారు దివాలా తీసింది. ఈ తరుణంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కొత్త ప్లాన్ రూపొందించింది. క్రమబద్ధమైన అభివృద్ధి, ఆదాయ వనరులను సమీకరించడమే లక్ష్యంగా చేసుకుని జిల్లాకేంద్రంగా మున్సిపాలిటీలు, గ్రామాలను కలుపుకుని అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ(యూడీఏ)లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే యూడీఏలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరముందని ఆఫీసర్లు చెబుతున్నారు. యూడీఏ చేయాల్సిన విధులకు సంబంధించిన రూల్స్, గైడ్‌లైన్స్ ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ప్రతి యూడీఏకు మాస్టర్ ప్లాన్
హెచ్ఎండీఏ తరహాలో ప్రతి అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ(యూడీఏ)కి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. దాని అనుగుణంగానే టౌన్ షిప్‌లను ఏర్పాటు చేయనున్నారు. లే అవుట్లు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం ప్రణాళిక ప్రకారం చేపట్టనున్నారు. ఆయా జిల్లా కేంద్రాలతో పాటు సమీపంలోని గ్రామాల్లో రోడ్ల నెట్‌వర్క్ అభివృద్ధి, తాగునీటి సరఫరా, ఉపాధి కల్పన, శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఈ అథారీటీలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. డెవలప్‌మెంట్ చార్జీలను యూడీఏనే వసూలు చేయనుంది. దీంతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఆదాయం తగ్గే అవకాశముందని పట్టణ ప్రణాళిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో 21 యూడీఏల ఏర్పాటు
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా హెచ్ఎండీఏ తరహాలో 21 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(యూడీఏ)లను ఏర్పాటు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగంగా వనపర్తి టౌన్, 5 మున్సిపాలిటీలు, 215 గ్రామాలను కలుపుకుని వనపర్తి యూడీఏను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మున్సిపాలిటీతో పాటు 152 గ్రామాలను కలిపి వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ ఆథారిటీ ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాకేంద్రంగా సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు 5 మున్సిపాలిటీలు, 264 గ్రామాలను కలిపి యూడీఏ, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 4 మున్సిపాలిటీలు, 286 గ్రామాలతో కలిపి యూడీఏను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 2 మున్సిపాలిటీలు, 279 గ్రామాలతో స్తంభాద్రి యూడీఏను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ మున్సిపాలిటీతో పాటు 4 మున్సిపాలిటీలు, 492 గ్రామాలతో వికారాబాద్ యూడీఏ, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 147 గ్రామాలతో శాతవాహన యూడీఏను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి మున్సిపాలిటీతో పాటు 5 మున్సిపాలిటీలు, 466 గ్రామాలతో సంగారెడ్డి యూడీఏ, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 3 మున్సిపాలిటీలు, 380 గ్రామాలతో నిజామాబాద్ యూడీఏ, నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు 3 మున్సిపాలిటీలు, 420 గ్రామాలతో నిర్మల్ యూడీఏ,
మహబూబాబాద్ జిల్లాలో టౌన్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 159 గ్రామాలతో మహబుబాబాద్ యూడీఏను ఏర్పాటు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో టౌన్‌తో పాటు 4 మున్సిపాలిటీలు, 319 గ్రామాలతో నాగర్‌కర్నూల్ యూడీఏ, మంచిర్యాల జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 350 గ్రామాలతో మంచిర్యాల్ యూడీఏ, మహబూబ్‌నగర్ జిల్లాలో టౌన్ మున్సిపాలిటీతో పాటు 153 గ్రామాలతో మహబుబ్‌నగర్ యూడీఏ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒక గ్రామంతో కొత్తగూడెం యూడీఏను ఏర్పాటు చేశారు. కామారెడ్డి యూడీఏలో 3 మున్సిపాలిటీలు, 460 గ్రామాలు ఉన్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, 199 గ్రామాలతో కాగజ్‌నగర్ యూడీఏ, 4 మున్సిపాలిటీలు, 194 గ్రామాలతో జోగులాంబ గద్వాల్ యూడీఏ, ఆదిలాబాద్ టౌన్‌తో పాటు ఒక మున్సిపాలిటీ, 107 గ్రామాలతో ఆదిలాబాద్ యూడీఏను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాకేంద్రంగా నారాయణపేట యూడీఏ, రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా రామగుండం యూడీఏను ఏర్పాటు చేశారు. రామగుండం కార్పొరేషన్‌తో చుట్టుపక్కల గ్రామాలైన 198 గ్రామాలు విలీనం చేయనున్నారు.
యూడీఏకు చైర్మెన్‌గా జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ సంబంధిత అర్బన్ డెవలప్‌మెంట్ ఆథారిటీల(యూడీఏ)కు చైర్మెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ చైర్మెన్‌గా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్), సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి/ సంబంధిత శాఖ నామినీ, పురపాలక శాఖ డైరెక్టర్/ డైరెక్టర్ చేసిన నామినీ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ)/ డీటీసీపీ నామినీ వ్యవహించనున్నారు.