- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa-2 తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు.. కోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ ఓనర్
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2(Pushpa-2) సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో(premiere show) వేయడంతో అభిమానులు సినిమా చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్(Sandhya theater) వద్ద కూడా డిసెంబర్ 4 రాత్రి సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి హీరో అల్లు అర్జున్(Allu Arjun) కూడా రావడంతో.. ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట( stampede) జరిగి రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ.. నేడు హైకోర్టులో పిటిషన్(Petition in High Court) వేశారు. రేవతి మృతికి తమకు సంబంధం లేదని పిటిషన్ లో తెలిపారు. అలాగే ప్రీమియర్, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతిచ్చింది అని.. పుష్ప-2 సినిమాకు తాము ప్రీమియర్ షోలు నిర్వహించలేదని.. డిస్ట్రిబ్యూటర్లు(Distributors) నేరుగా సినిమాను నడిపించుకున్నారని.. అయినప్పటికీ తమ వంతుగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటి మాపైనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని సంధ్య థియేటర్ యజమాని రేణుక దేవి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ తొక్కిసలాటపై స్పందించిన హీరో అల్లు అర్జున్, ప్రొడ్యూసర్లు.. బాధిత మహిళ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా.. బాలుడికి ఎల్లప్పుడు తోడు ఉంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.