- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
దిశ,వనపర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే మహిళా డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలికల జూనియర్ కాలేజ్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రిని భద్రపరిచిన గదులను తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను స్వీకరించాలని సూచించారు. వంట సామాగ్రి కి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్ళీ వండి విద్యార్థులకు వడ్డించాలని పేర్కొన్నారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వనపర్తి ఆర్డీవో సుబ్రహ్మణ్యం,తాసిల్దార్ రమేష్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.