ఆరు నెలలకే వ్యతిరేకత.. మళ్లీ అధికారం మాదే: వైఎస్ జగన్

by srinivas |   ( Updated:2024-12-11 11:15:34.0  )
ఆరు నెలలకే వ్యతిరేకత.. మళ్లీ అధికారం మాదే: వైఎస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్(YS Jagan) మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోందన్నారు. వైసీపీ(Ycp) హయాంలో పలావు పెడితే.. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) బిర్యానీ పెడతారన్నారని, ఇప్పుడు ఆ రెండూ పోయాయని చెప్పారు. మన వ్యక్తిత్వం, విశ్వసనీయ వల్లే రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని వైఎస్‌ జగన్‌ దీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధపు హామీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దానివల్లనే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి నెల ఏదో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వచ్చారని, బాదుడే బాదుడే మొదలైందని విమర్శించారు. కరెంట్ బిల్లులు చూస్తే షాకులు తగులుతాయని విమర్శించారు. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం పడనుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed