- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూ బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలి
దిశ, రాజంపేట : మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు ఆందోళన చేశారు. రాజంపేట మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీ లో సుమారు 60 నుండి 70 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కాలనీ పేరుకు మండల కేంద్రంలోని కాలనీ ఏ కానీ.. ఎలాంటి కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమ సమస్యల గురించి ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు,ఎమ్మెల్యే కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అలాగే పత్రిక మిత్రులు కాలనీ సమస్యలపై ఎన్ని కథనాలు ప్రచురించినా.. అధికారులకు, రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తిన్టు ప్రవర్తిస్తున్నారని,కాలనీ వాసులు వాపోయారు. దీంతో విసిగిపోయి తాము సమస్యల పరిష్కారం కోసం బుధవారం రాస్తారోకో నిర్వహించామన్నారు. కాలనీలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని, కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. రోడ్లు వేయాలని, వీధి దీపాలు వేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో రఘురాం పంచాయతీ కార్యదర్శిఅశోక్ కుమార్, మిషన్ భగీరథ ఏఈ రజిత కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీ సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఎంపీడీవో రఘురాం హామీ ఇవ్వడంతో..కాలనీవాసులు రాస్తారోకో విరమించారు. అనంతరం ఎంపీడీవో రఘురాం కాలనీలోని వార్డులను పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.బీసీ కాలనీ సమస్యలు పరిష్కరించాలి