- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC గ్రూప్ 4 పరీక్ష రాసే అభ్యర్థులకు.. కీలక సూచనలు ఇవే!
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జులై 1న ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు చేసింది. అవేంటో తెలుసుకుందాం..
సూచనలు:
1. గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
2. పేపర్ - 1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ - 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
నోట్: పేపర్ -1 పరీక్షకు ఉదయం 8 గంటల నుంచి, పేపర్ - 2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
3. పరీక్షా కేంద్రంలో భద్రతా సిబ్బందికీ, పరీక్ష గదిలోని ఇన్విజిలేటర్‌కు ఫోటో గుర్తింపుకార్డు చూపించాల్సి ఉంటుంది.
4. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
5. గ్రూప్ - 4 పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలి ముద్రను తప్పనిసరి చేశారు. నామినల్ రోల్ లో సంతకం తర్వాత ఎడమ చేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
6. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కి అందించి వేలి ముద్ర వేయాల్సి ఉంటుంది.
7. అభ్యర్థులు ప్రశ్నాపత్రం సమాధానాలను మార్క్ చేయకూడదు. గ్రూప్ - 4 ఓఎంఆర్ పత్రంలో హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతో పాటు సంతకం కూడా చేయాలి.
8. ఓఎంఆర్ పత్రంలో బ్లూ/బ్లాక్ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నాపత్రం నంబరు రాయాలి.
9. హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయక పోయినా, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంకు పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ పత్రం చెల్లు బాటు కాదు.
10. ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ కారు కీస్, విలువైన, నిషేధిత వస్తువులు తీసుకెళ్ల కూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని గుర్తుంచుకోండి. షూ వేసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్లవద్దు.