టీఎస్పీఎస్సీ: పేపర్ లీకేజీలో వ్యవహారంలో ఉద్యోగి సస్పెన్షన్..

by Kalyani |
టీఎస్పీఎస్సీ: పేపర్ లీకేజీలో వ్యవహారంలో ఉద్యోగి సస్పెన్షన్..
X

దిశ, మహమ్మదాబాద్/గండీడ్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గండీడ్ మండలంలో ఉపాధిహామీ సాంకేతిక సహాయకుడిగా పనిచేస్తున్న తిరుపతయ్య సస్పెండ్ అయ్యారు. మధ్యవర్తిగా వ్యవహరించిన తిరుపతయ్యతో పాటు మరికొందరు నిరుద్యోగులకు ఆశ కల్పించి డబ్బులు వసూలు చేశారని రుజువు కావడంతో డీఆర్డీఓ యాదయ్య మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని గండీడ్ ఎంపీడీవో రూపేందర్ రెడ్డి ధ్రువీకరించారు. దీంతో తిరుపతయ్యను ఇతర నిందితులను ఐదు రోజులపాటు పోలీసుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

Advertisement

Next Story