- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభ్యర్థుల కోసం TSPSC కాల్ సెంటర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తో పాటు అభ్యర్థులకు అవసరమైన వివరాలు అందించేందుకు హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లకు అవసరమైన సేవలను వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అధికారులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇచ్చేందుకు టీఎస్ పీఎస్ సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త అభ్యర్థుల వివరాలను నమోదు చేసుకోవడం, ఇప్పటికే ఉన్న వివరాలను ఎడిట్ చేసుకోవడానికి వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) సేవలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులకు మరింత మెరుగైన సేవలను అందించడం కోసం కొత్తగా కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ కి సంబంధించిన ఏ విషయాన్నైనా 04022445566 అనే నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది. 040-23542185, 040-23542187 అనే ఫోన్ నంబర్లలో టెక్నికల్ టీంను కూడా సంప్రదించవచ్చు.
- Tags
- TSPSC
- CALL CENTER