- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ ఫైటింగ్.. అక్కడ సైలెంట్.. టీఆర్‌ఎస్‌లో డబుల్ గేమ్
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగం మొదలు వివిధ శాఖల పద్దులపై చర్చల వరకు కేంద్రంపై వరుస విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సందర్భానుసారం కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో మాత్రం ఆ పార్టీ ఎంపీలు సైలెంట్‌గా ఉన్నారు. దాదాపు సగం మంది హాజరు కావడమే లేదు. చర్చించడానికి పెద్దగా అంశాలే లేవంటున్నారు. గత నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంఫై నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు.. ఈసారి మాత్రం మౌనం వహించారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం మారింది. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురై నాలుగైదు రోజులుగా విశ్రాంతిలో ఉన్నారు. దీంతో ఎంపీలకు దిశానిర్దేశం చేయలేకపోయారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు క్లారిటీ లేకుండా పోయింది. ''కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది.. ఫెడరల్ స్ఫూర్తి లేకుండా పోయింది.. రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతున్నది... తెలంగాణ పట్ల వివక్ష కనిపిస్తున్నది'' అంటూ స్వయంగా సీఎం కేసీఆర్ గత నెల 1వ తేదీ సాయంత్రం సుదీర్ఘ మీడియా సమావేశంలో మోడీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన అంశాలను సాధించుకోవాలని, కేంద్ర మెడలు వంచాలని, పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అదే తీరులో నిరసనలు చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచారు. గత నెలలో మొదలైన బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఇప్పుడు సెకండ్ సిట్టింగ్ మొదలైంది. కేంద్రంపై కొట్లాడాలనుకున్న టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు నోరెత్తడం లేదు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత సోమవారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చి మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. "ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పెద్దగా లేవనెత్తాల్సిన అంశాలేమీ లేవు.. మా అధినేత నుంచి స్పష్టమైన అదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం.. వచ్చే ఎన్నికలు మాత్రం టాప్ ప్రయారిటీగా ఉండే అవకాశం ఉంది.. అసెంబ్లీ ఎన్నికల నాటికి మా అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.." అని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదంటూ టీఆర్ఎస్ తన వాదనను బలంగా వినిపిస్తున్నా పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని కార్నర్ చేయడానికైతే ఈ సమావేశాలను వినియోగించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బడుగుల లింగయ్య యాదవ్ తదితరులే పార్లమెంటు సెషన్ కు హాజరవుతున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందడంతో కేంద్రంతో అప్పటివరకూ ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఉప్పు-నిప్పులాగా మారిపోయాయి. తాజాగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో మరింత దూకుడుగా వ్యవహరించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను సైతం అందుకు వాడుకోవాలనే వ్యూహం ఉన్నప్పటికీ సీఎం విశ్రాంతిలో ఉండడంతో ఘాటు వ్యాఖ్యలు అసెంబ్లీకి మాత్రమే పరిమితమయ్యాయి. ''బీజేపీని కూకటివేళ్లతో బంగాళాఖాతంలోకి విసిరేయాలి.. దాన్ని నిర్మూలిస్తేనే దేశ ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది..'' లాంటి కామెంట్లు చేసినా నాలుగు రాష్ట్రాల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ సైలెంట్‌గా ఉండడానికి కారణం సీఎం అనారోగ్యంతో విశ్రాంతిలో ఉండడమా లేక వ్యూహాత్మక ఎత్తుగడా అనేది చర్చనీయాంశంగా మారింది.