సీఎం కేసీఆర్‌ను కలిసిన ట్రెసా బృందం

by Vinod kumar |
సీఎం కేసీఆర్‌ను కలిసిన ట్రెసా బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము (కొత్త కలెక్టరేట్) ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను బుధవారం ట్రెసా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులు, పలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి త్వరలో పిలిచి మాట్లాడతానని పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌తో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. నాగమణి, కార్యదర్శి వాణి, సంయుక్త కార్యదర్శులు ఎల్.వెంకటేశ్వర్ రావు, గోవర్ధన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్, జిల్లా కార్యదర్శి వి. రామకృష్ణా రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గౌరీ వత్సల, జిల్లా కార్యవర్గ సభ్యులు తహశీల్దార్లు విజయలక్ష్మి, భూపాల్, మహిపాల్ రెడ్డి, గీత, ఎస్తేర్ అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story