అధికారిపై దాడి.. రవాణా శాఖ అధికారుల పెన్ డౌన్

by prasad |
అధికారిపై దాడి.. రవాణా శాఖ అధికారుల పెన్ డౌన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు పెన్ డౌన్ పాటిస్తున్నారు. నిన్న ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జేటీసీ రమేశ్ పై ఆటో యూనియన్ నేత దాడికి పాల్పడిన ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తను అడిగిన పని చేయడం కుదరదని జేటీసీ రమేశ్ ​కుమార్ చెప్పడంతో నిన్న అమానుల్లాఖాన్ జేటీసీని చెంపదెబ్బ కొట్టారు. దీనికి నిరసనగా శుక్రవారం రవాణా శాఖ ఉద్యోగులు నిరసనకు దిగారు. నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే రవాణా శాఖ కమిషనర్ తో చర్చల అనంతరం పెన్ డౌన్ ఆలోచన విరమించుకుని నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. భౌతిక దాడులు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Next Story

Most Viewed