తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య స్తంభించిన రాకపోకలు

by Jakkula Mamatha |
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య స్తంభించిన రాకపోకలు
X

దిశ,భద్రాచలం:భద్రాచలంలో గోదావరి వేగంగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం రాత్రి 9 గంటలకు 31.5 అడుగులు ఉన్న గోదావరి, మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మరింత పెరిగే అవకాశం ఉంది. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై గోదావరి వరద నీరు చేరడంతో తెలంగాణా, చతిస్గడ్ కు రాకపోకలు స్తంభించాయి. అటువైపు వాహనాలను వెళ్ళకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story