'కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ ప్లీజ్'.. గాంధీభవన్‌లో దరఖాస్తు

by Vinod kumar |
కరీంనగర్ అసెంబ్లీ టిక్కెట్ ప్లీజ్.. గాంధీభవన్‌లో దరఖాస్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న తనకు కరీంనగర్ నుంచి టిక్కెట్ కేటాయించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్​ హై కమాండ్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన గాంధీభవన్‌లో టిక్కెట్ కొరకు దరఖాస్తు చేశారు. పార్టీ సూచించిన దరఖాస్తు ఫామ్‌తో పాటు డీ.డీ లను –కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​గౌడ్‌కు అందజేశారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవను గుర్తించి రాబోయే ఎన్నికలలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను తనకు కేటాయించాలని మహేష్ కోరారు. ఇదిలా ఉండగా, రాజయ్య, పద్మ దంపతులకు ఆయన కరీంనగర్‌లో జన్మించారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహేష్ ​కష్టబడి ఉన్నత చదువులు పూర్తి చేశారు. కామర్స్ విభాగం లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. మలి దశ ఉద్యమంలో ఓయూ జేఏసీ కన్వినర్‌గా వర్క్ చేశారు. 2009 నుంచి 2014 వరకు వివిధ ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 35 రోజులు జైలు జీవితంగడపాల్సి వచ్చింది. ఉద్యమం సమయంలో అనేక తెలుగు, ఇంగ్లీష్​ ఛానల్స్‌లో దాదాపు 3,500 మంది డిబెట్‌లలో భాగస్వామ్యం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ సభ్యుడిగా, టీపీసీసీ, ఏసీసీసీ కమిటీల్లో కీలక పదవుల్లో పనిచేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహేష్​కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాష్ట్రంలో జరిగే క్రీయాశీలక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Next Story