ధర్నాకు నో పర్మిషన్.. TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Satheesh |   ( Updated:2023-01-02 06:19:30.0  )
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని మండలాలల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని.. అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై ఇందిరా పార్కు వద్ద టీ- కాంగ్రెస్‌ చేపట్టనున్న ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.

కాగా, ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా.. ఏట్టి పరిస్థితుల్లో ఆందోళన చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముందుగానే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, వీహెచ్, మల్లురవి, జీవన్ రెడ్డి వంటి నేతలను పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా పోలీసులు, ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు.

Also Read...

అలా జరిగితే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా: MP Uttam Kumar Reddy

Advertisement

Next Story

Most Viewed