- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అత్యుత్సాహంతోనే సమస్య..’ కొండా సురేఖ, రేవూరి వివాదంపై టీపీసీసీ చీఫ్
దిశ, వెబ్‌డెస్క్: కొండా సురేఖ, రేవూరి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. వివాదం తన దృష్టికి వచ్చిందని, అయితే ఇది కార్యకర్తల అత్యుత్సాహంతో వచ్చిన సమస్యే కానీ.. నేతల మధ్య ఎలాంటి వివాదం లేదని చెప్పారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రభాకర్ రెడ్డితో కూడా తాను మాట్లాడానని, చర్చలతో వివాదం ముగిసిందని ప్రకటించారు. అయితే గీసుకొండ పీఎస్‌లో సీఐ చైర్‌లో మంత్రి కొండా సురేఖ కూర్చున్న విషయం మాత్రం తన దృష్టికి రాలేదని, దానికి సంబంధించిన సమాచారం లేకుండా తాను మాట్లాడలేనని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాగా.. దసరా నాడు కొండా సురేఖ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రేవూరి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకపోవడంతో మొదలైన రగడ ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే రేవూరి వర్గీయుడైన అనిల్‌పై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.