- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TRS ఎమ్మెల్యేల కొనుగోలుపై అగ్రనేతల మౌనం..
దిశ, తెలంగాణ బ్యూరో: ఆపరేషన్ ఫాం హౌజ్ ఎపిసోడ్ లో ప్రగతిభవన్ సైలెంట్ గా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ ఇంత వరకు పెదవి విప్పలేదు. మొయినాబాద్ ఫాం హౌజ్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతో పలు దఫాలుగా చర్చలు జరిపారే తప్పా, ఏ విషయాన్ని కూడా ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు. మీడియా సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ ఏదో చెప్తారని పార్టీశ్రేణులు ఆసక్తిగా ఎదురుచూశారు. పక్కా ఆధారాలు చూపిస్తారని భావించారు. కానీ, ఆయన ప్రెస్ మీట్ ఉండదని చెప్పడంతో నిరాశ చెందారు. ఎలాంటి ఎవిడెన్స్ లేదేమోనని చర్చించుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మాత్రమే స్పందించారు. కేసు విచారణ దశలో ఉందని, ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. తమకు ప్రలోభాలకు గురిచేసిందెవరనే విషయంపై నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి వివరిస్తారని టీఆర్ఎస్ లీడర్లు మొదట లీకులు ఇచ్చినా.. ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు.
వరుస మీటింగ్స్
అధిష్టానం ఆదేశాలతో బాధిత ఎమ్మెల్యేలు ఉదయమే ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారితో పలు దఫాలుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సమావేశమైనట్టు తెలిసింది. కేసు విచారణ టైమ్ లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అయితే పార్టీ మారేందుకు ఎప్పుడు ఆఫర్ వచ్చింది? ఇంకా ఏ ఏ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు? అంటూ సీఎం కేసీఆర్ కూడా వారిని అడిగినట్లు సమాచారం.
అర్ధరాత్రి హడావుడి.. తర్వాత మౌనం
ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని బుధవారం అర్ధరాత్రి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రులు నేషనల్ హైవేపైకి వచ్చి మరీ రాస్తారోకో చేశారు. కానీ గురువారం రోజు ఆ విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.
ఇవి కూడా చదవండి
1.TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.....లక్ష్మీపూజ కోసమే ఫాంహౌజ్‌కు వెళ్లారా?