Producer arrested: భూమిని కాజేసినందుకు టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్

by Mahesh |
Producer arrested: భూమిని కాజేసినందుకు టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ (Sivaramakrishna)ను పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. రాయదుర్గం(Rayadurgam)లో దాదాపు 84 ఎకరాల భూమిని సొంతం చేసుకోవాలని చూసిన ఆయన... స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్నారు. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్(Department of Archaeology) సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు. అనంతరం సదరు 84 ఎకరాల ల్యాండ్‌ తనదేనంటూ శివరామకృష్ణ(Sivaramakrishna) క్లయిమ్ చేశాడు. అనంతరం ఆ భూమిలో బిల్డర్‌ మారగొని లింగం గౌడ్ సాయంతో పాగా వేశాడు. కాగా ఈ ఇష్యూపై 2003లో అప్పటి ప్రభుత్వం నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసింది. నాటి నుంచి ఈ కేసు కొనసాగుతుండగా.. సదరు ప్రభుత్వ భూమి కోసం హైకోర్టు(High Court) నుండి సుప్రీంకోర్టు(Supreme Court) వరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. పూర్తి వాదనలు, సాక్షాదారాలను పరిశీలించిన తర్వాత.. శివరామకృష్ణ కోర్టుకు సమర్పించినవి నకిలీ పత్రాలు అని సుప్రీం కోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో శివరామకృష్ణ తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అనంతరం శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Advertisement

Next Story