- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ.. ట్వీట్ చేసిన సీఎం
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కలిశారు. ఈ మేరకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన పుష్పగుచ్చం అందజేశారు. కాగా, ఇటీవల నిర్వహించిన వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా రాకపోయినప్పటికీ తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు ఉండడంతో ఆయన్నే విజేతగా ప్రకటించారు. కాగా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడికి వచ్చిన తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు.