- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పైలాన్ కట్టిన పట్టణంలోనే నీళ్లు లేవు: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు (Budget sessions in Telangana Assembly) కొనసాగుతున్నా. ఈ క్రమంలో ఐదో రోజు ఉదయం కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ (High fluoride) ఉన్న ప్రాంతంగా మునుగోడు నియోజకవర్గం (Munugodu Constituency) ఉందని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ (Mission Bhagiratha) కు 50 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిందని.. ఇందులో పైలాన్ (Pylon) కట్టిన చౌటుప్పల్ పట్టణం (Choutuppal town) లోనే నీళ్లు లేవని (no water) చెప్పుకొచ్చారు.
మిషన్ భగీరథ కోసం వేలకోట్ల రూపాయల అప్పులు చేసి నిర్మించిన ప్రాజెక్టు వల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు కానీ.. దాని ఫలితాలు ప్రజలకు సరిగ్గా అందలేదని చెప్పుకొచ్చారు. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటం వల్ల నారాయణపూర్ చౌటుప్పల్ మండలాలలో భూగర్భ జలాలు (Ground water) పడిపోయి పంటలు ఎండిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చౌటుప్పల్ పట్టణానికి (Choutuppal town) తాగునీటి కేటాయింపులు జరిగాయని.. అక్కడ ఉన్న పరిశ్రమల (industries) వల్ల జనాభా పెరిగిందని.. ఇప్పటి జనాభా ప్రాతిపదికన నీటి కేటాయింపులు లేకపోవడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని సభలో కోరారు.