ఎస్సెస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం.. 5 నిమిషాలే గ్రేస్ పీరియడ్

by srinivas |   ( Updated:2025-03-20 16:47:33.0  )
ఎస్సెస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం.. 5 నిమిషాలే గ్రేస్ పీరియడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి వచ్చే నెల 4 వరకు పరిక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరిక్షలకు 5,09,403 మంది విద్యార్ఢులు హజరుకానున్నారు. వీరిలో బాలురు 2,58,895 బాలికలు 2,50,508 మంది ఉన్నారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే 2650 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లను, 28100 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరిక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాలకు తీసుకురాకూడదని తెలిపారు.

5 నిమిషాల గ్రేస్ పీరియడ్ః:

గతంలో పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యం వచ్చినా అనుమతించేవారు కాదు, అయితే ఈ నిబంధనను ప్రభుత్వం కొంతమేర సడలించింది. పరీక్ష రాసే విద్యార్థులకు గ్రేస్ పీరియడ్ ప్రకటించింది. దీని ద్వారా పరీక్ష టైం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కానీ ముందు జాగ్రత్తగా కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యంగా వెళ్లి టెన్షన్ తో పరీక్ష రాసే కన్నా అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్ష రాయవచ్చని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 7 నుంచి 15 వరకు జరగనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed