- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Expensive watches: భారత్ లో ఖరీదైన వాచీలకు పెరుగుతోన్న గిరాకీ

దిశ, వెబ్‌డెస్క్: Expensive watches: డబ్బు మనిషిని రాజ్యాలను ఏలే రాజులుగా మార్చేస్తుంది. రోడ్లపై బిచ్చగాళ్లుగా కూడా మార్చేస్తుంది. దాన్ని ఎలా వాడుతున్నామనేదే ప్రధానం. అయితే సంపాదించిన సొమ్మంతా ఎలా దాచుకుంటున్నామనేది కూడా ముఖ్యమే. డబ్బు దాయాలంటే చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకులు, సేవింగ్స్ స్కీమ్స్, రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులు, భవనాలు కొనుగోలు చేయడం. ఇలా పలు మార్గాల్లో డబ్బులు దాస్తున్నారు. వీటితోపాటు బాగా డబ్బు సంపాదిస్తున్నవారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేస్తున్నారు. వాటి రూపంలో సంపదను దాస్తున్నారు.
ఎందుకంటే ఇటీవలి కాలంలో భారత్ లో ఖరీదైనా వాచీలకు గిరాకీ భారీగా పెరుగుతోంది. స్విట్జర్లాండ్ నుంచి ఏడాదికి రూ. 2,500కోట్ల విలువైన వాచీలు దిగుమతి అవుతున్నాయి. ఇందులో ఏటా 15శాతం వృద్ధి కనిపిస్తోందని బ్రైట్లింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ భానోత్ తెలిపారు. హైదరాబాద్ లో సంస్థ ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడారు. వాచీలు స్థోమతకు చిహ్నంగా మారాయంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం నాలుగు విక్రయ కేంద్రాలు ఉన్నాయని..రాబోయే 18 నెలల్లో వీటి సంఖ్య 10కి చేరుకుంటుందన్నారు.
దేశీయంగా ఖరీదైన వాచీల విక్రయాల్లో తమది మూడోస్థానమని, ఏటా 15శాతానికి మించి వృద్ధి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. తమది 140 ఏళ్ల చరిత్ర కలిగిన గడియారం సంస్థ అనీ..అంతరిక్షంలోకి వెళ్లిన తొలిగడియారంగాను తమ బ్రాండుకు గుర్తింపు ఉందని తెలిపారు. రూ. 3.5-12 లక్షల శ్రేణిలో తమ వాచీలు లభిస్తాయని, బంగారు వాచీల ధర రూ. 17లక్షల వరకు ఉంటుందన్నారు.
ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా గడియారాలు ఏవంటే...
గ్రాఫ్ డైమెండ్స్ హాలూసినేషన్ ధర రూ. 458కోట్లు
గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్ ధర రూ. 333కోట్లు
పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చైమ్ రెఫ్ ధర రూ. 258కోట్లు
జేగర్ లెకౌల్ట్రే జోయిలెరీ 101 మాన్చెట్ ధర రూ. 216కోట్లు
చోపార్డ్ 201 క్యారెట్ ధర రూ. 208కోట్లు
పటేక్ ఫిలిప్ హెన్రీ గ్రేవ్స్ సూపర్ కాంప్లికేషన్ ధరరూ. 200కోట్లు
రోలెక్స్ పాల్ న్యూమన్ డేటోనా రెఫ్ ధరరూ. 155కోట్లు