- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Amaravati: ఏపీ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగుల(AP Employees)కు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 6,200 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో శుక్రవారం బకాయిలు వచ్చి చేరనున్నాయి.
కాగా కూటమి ప్రభుత్వం అడ్మినిస్టేషన్‌లో దూసుకుపోతోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవ చేస్తోంది. అటు ఉద్యోగులను సైతం పరుగులు పెట్టిస్తోంది. మంచి పాలన అందిస్తోందనేలా ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోంది. అయితే ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల విడుదలపై ఫోకస్ పెట్టింది. ఆర్థిక శాఖతో చర్చించింది. నిధులు విడుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెండింగ్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసింది.