ముగిసిన విష్ణు ప్రియ , రీతు చౌదరి విచారణ..

by Kalyani |
ముగిసిన విష్ణు ప్రియ , రీతు చౌదరి విచారణ..
X

దిశ ఖైరతాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసిన వారిపై ప్రైవేటు ఉద్యోగి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే పంజాగుట్ట పోలీసులు 11 మందికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. బుధవారం యూట్యూబర్ టేస్టీ తేజ విచారణకు హాజరయ్యాడు. గురువారం నటి విష్ణుప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ 11 గంటలు, రీతు చౌదరి 5 గంటలపాటు విచారణ కొనసాగింది. న్యాయవాది జక్కుల లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈనెల 25 తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేశారు, ప్రమోషన్లకు డబ్బులు ఏవిధంగా వస్తున్నాయి, హవాలా డబ్బు సంబంధించి కూడా ప్రమేయం ఉందా అనే వివరాలపై పోలీసులు ఆరా తీసినట్లు సమాచార.

Next Story