- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pm modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు రూ.22కోట్ల ఖర్చు.. పార్లమెంటుకు తెలిపిన కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో: 2023 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు అయినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటుకు తెలిపింది. గత మూడేళ్లలో పీఎం మోడీ విదేశీ పర్యటనల నిమిత్తం భారత రాయబార కార్యాలయాలు చేసిన మొత్తం ఖర్చు వివరాలు తెలియజేయాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) అడగగా దీనికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా (Pabithra margarita) లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2022 నుంచి 2024 వరకు ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను ఆయన వెల్లడించారు. 2022-24లో మోడీ మొత్తం 38 దేశాలను సందర్శించగా 2023 జూన్‌లో మోడీ యూఎస్ టూర్‌కు రూ.22,89,68,509 ఖర్చు కాగా.. 2024 సెప్టెంబర్‌లో సందర్శించినప్పుడు రూ.15,33,76,348 ఖర్చు చేశారు.
మోడీ తన పర్యటనల్లో భాగంగా 2022లో నేపాల్ (Nepal) టూర్‌కు అత్యల్పంగా రూ. 80 లక్షల 1 వేల 483 ఖర్చు చేయగా 2023లో అమెరికా పర్యటనే అత్యధికంగా ఖర్చు చేశారు. 2023 మేలో జపాన్ పర్యటనకు రూ.17,19,33,356 ఖర్చు చేశారు. 2022 మేలో జర్మనీ పర్యటన నుంచి 2024 డిసెంబర్‌లో కువైట్ పర్యటన వరకు అన్ని టూర్ల వివరాలను మార్గరిటా వివరించారు. అంతేగాక మోడీ 2011 లో యూఎస్ పర్యటనకు రూ. 10,74,27,363, రష్యాలో 2013 లో రూ. 9,95,76,890 ఖర్చు చేసినట్టు తెలిపారు.