- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Delimitation : చెన్నై డిలిమిటేషన్ సమావేశానికి తెలంగాణ నేతలు

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) నేతృత్వంలో జరగనున్న చెన్నై డిలిమిటేషన్(Delimitation) అఖిలపక్ష సమావేశానికి(All Party Meeting) తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఈనెల 22న జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), బీఆర్ఎస్ నుంచి కేటీఆర్(KTR), మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తోపాటు, పలువురు రాజ్యసభ ఎంపీలు హాజరవనున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయనున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కాగా దీనిని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉంటుందని, తద్వారా డిలిమిటేషన్ విధానం ద్వారా సౌత్ లోని రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని తెలుపుతున్నారు. డిలిమిటేషన్ విధానాన్ని రద్దు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా తమిళనాడు సిఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఈనెల 22న చెన్నైలో జరగనుంది.