- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో పతాక స్థాయికి విద్యుత్ డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పతాక స్థాయికి చేరుకుంది. నిన్న బుధవారం సాయంత్రం 4.40 గంటలకు 17, 162 మెగా వాట్లుగా నమోదు చేసింది. గతేడాది ఇదే రోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 13,557 మెగా వాట్లుగా ఉంది. ఒక పక్క వేసవి, మరో వైపు వ్యవసాయ పరంగానూ విద్యుత్వినియోగం ఒక్క సారిగా పెరిగింది. ఆ ప్రకారంగానే రోజు వారీగా డిమాండ్ పెరుగుతు వస్తోంది. గతేడాది మార్చి 8న నమోదయిన అత్యధిక విద్యుత్ డిమాండు 15623 మెగావాట్లు కాగా దీన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 5 న అధిగమించింది. ఈ మార్చి నెల ప్రారంభం నుండి ప్రతి రోజూ విద్యుత్ డిమాండ్ 16000 మెగావాట్ల కు మించి నమోదవు వస్తోంది. తాజాగా 17,162 మెగావాట్లుగా నమోదయి గత డిమాండ్లను సైతం అధిగమించింది. ఈ సీజన్ లో 335.19 మిలియన్ యూనిట్ల ( మార్చ్ 18, 2025 న) అత్యధిక వినియోగం జరిగింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో సైతం రికార్డు స్థాయి డిమాండ్ లు నమోదవుతు వస్తున్నాయి. నిన్న గురువారం 11017 మెగావాట్లు గా నమోదయ్యింది. గతేడాది ఇదే రోజు రికార్డు అయిన అత్యధిక డిమాండ్ 8612 మెగా వాట్లు గా ఉంది. ఈ సీజన్ లో 222.07 మిలియన్ యూనిట్ల ( మార్చ్ 19, 2025) అత్యధిక వినియోగం జరిగింది.