OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ రాబోతుంది.. థ్రిల్ అవ్వడానికి మీరు సిద్ధమేనా?

by sudharani |
OTT: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హిట్ సిరీస్ రాబోతుంది.. థ్రిల్ అవ్వడానికి మీరు సిద్ధమేనా?
X

దిశ, సినిమా: జీత్ (Jeet), ప్రసేన్‌జిత్ ఛటర్జీ (Prasenjit Chatterjee), శాశ్వత, పరంబ్రత ఛటర్జీ (Parambrata Chatterjee) ప్రధాన పాత్రల్లో నటించింన లేటెస్ట్ సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (Khaki: The Bengal Chapter). క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ‘ఖాకీ: ది బెంగాల్ చాప్లర్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. ఈ నెల 20 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో బెంగాల్‌(Bengal)లోని పరిస్థితులను చూపించే విధంగా రూపొందిన ఈ సిరీస్‌లో.. అధికార దాహంగల గ్యాంగ్‌స్టర్లు (Gangsters), రాజకీయ (political) నాయకులు పాలించే నగంలో శాంతిని కాపాడటానికి అధికారులు కష్టపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న చట్టాన్ని, అక్కడ ప్రజలను కాపాడేందుకు ఐపీఎస్ అర్జున్ మైత్రా రంగంలోకి దిగుతాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురౌవుతాయి అనేది కథ. కాగా.. ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ (Khaki: The Bihar Chapter)కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది. ప్రముఖ ఐపీఎస్ (IPS) అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ‘బిహార్ చాప్టర్’ తెరకెక్కగా.. 2022లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ప్రజా ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ రాబోతుండటంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story