TG Assembly: ఆ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి ఉత్తమ్ కీ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-03-18 08:26:57.0  )
TG Assembly: ఆ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి ఉత్తమ్ కీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో భాగంగా ఐదో రోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును (SC Category Rationalization Bill) ప్రవేశ పెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సభలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) మొదటి నుంచి కట్టుబడి ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆ అంశంపై తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

పకడ్బందీగా ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. పంజాబ్ (Punjab), హర్యానా (Haryana), తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు అవుతోందని పేర్కొన్నారు. షమీమ్ అక్తర్ కమిటీ (Shamim Akhtar Committee) అధ్వర్యంలోని కమిటీ ఎస్సీల్లోని 52 కులాల వర్గీకరణపై అధ్యయనం చేసిందని అన్నారు. ఎంతో పాదర్శకంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామని.. ఎస్సీ సంఘాలు సూచనలు, సలహాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story