- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Summer Special : కనువిందు చేస్తున్న రంగురాళ్ల దీవులు.. ఎక్కడున్నాయంటే..

దిశ, ఫీచర్స్ : అందమైన ప్రకృతి సౌందర్యాన్ని.. అలరించే సముద్ర తీరాలను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి?! ముఖ్యంగా వేసవిలో చల్ల చల్లని టూరిస్టు ప్రదేశాలను చుట్టేసి రావాలని కలలుగనే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారిని కనువిందు చేసే అద్భుతమైన ప్రదేశాల్లో కానరీ దీవులు ఒకటి. ఇవి ఆఫ్రికా వాయువ్య తీరంలో, స్పెయిన్ దేశంలో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో వీటికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఎందుకంటే ఈ దీవులు, ఇక్కడి బీచ్‌లు అందమైన రంగు రాళ్లకు ప్రసిద్ధి చెందాయి. వేసవిలో ఇవి మరింత ప్రత్యేకంగా కనివిందు చేస్తూ అలరిస్తుంటాయి.
*ఏ ఒకటో రెండో కాదు, ఆఫ్రికా తీరంలోని స్పానిష్ ద్వీప సమూహంలోని అనేక బీచ్‌లు నలుపు, తెలుపు, నీలం, ఆకుపచ్చ రగుంలతో నిండి ఉంటాయి. వాటిపైకి వేగంగా వచ్చిపోయే అలలు, పలు చోట్ల తేటనీటిలోంచి పైకి కనిపించే రంగు రాళ్లను చూసి టూరిస్టులు పరవశించిపోతుంటారు. వేసవిలో ఈ అద్భుతమైన దృశ్యాలను చూసేందుకే చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మరో విషయం ఏంటంటే కేవలం చూడటమే కాదు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు తమకు నచ్చిన రంగు రాళ్లను తీసుకెళ్లవచ్చు కూడా. చాలామంది చిన్న చిన్న రాళ్లను తమవెంట తీసుకెళ్తుంటారని పర్యాటక నిపుణులు చెబుతున్నారు.
* కానరీ దీవుల్లో టెనెరిఫే, గ్రాన్ కానరియా, లాంజరోట్, ఫ్యుర్టెవెంచురా, లా పాల్మా, లా గోమెరా, ఎల్. హీరో వంటి రంగు రాళ్ల ద్వీపాలు ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి మాత్రమే కాదు, ఇక్కడ మంచుతో కూడిన అతిపెద్ద పర్వతం ‘మౌంట్ టీడే’ కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఓ వైపు రంగు రాళ్లతో కూడిన తీర ప్రాంతాలు, మరోవైపు మంచు పర్వతాలు కలిసి ఉండటం కారణంగా కానరీ దీవులు పర్యాటకులను అలరిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో ఇవి మరింత అందంగా, ఆహ్లాదకరంగా, చల్లగా ఉండటంతో ప్రపంచ పర్యాటకులను అలరిస్తుంటాయి.