టెస్టుల కోసం వెళ్లిన మహిళ.. అక్కడి సిబ్బంది చేసిన పనికి ఇన్ఫెక్షన్..

by Sumithra |
టెస్టుల కోసం వెళ్లిన మహిళ.. అక్కడి సిబ్బంది చేసిన పనికి ఇన్ఫెక్షన్..
X

దిశ, శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ లోని మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్ సెంటర్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల పైకి తెచ్చింది. సోమవారం ఉదయం టెస్ట్ ల కోసమని కూకట్ పల్లిలోని మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్ సెంటర్ కు వెళ్లింది ఓ మహిళ. అక్కడున్న సిబ్బంది టెస్టులు చేస్తుండగా చేతికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వాల్సిన చోట కాకుండా మరోచోట ఇవ్వడంతో ఇన్ఫెక్షన్ గా మారి చేయి మొత్తం ఉబ్బిపోయింది.

అనంతరం రెండు గంటల తర్వాత చేతి మీద మొత్తం బబుల్స్ రావడంతో మరలా తిరిగి డయాగ్నస్టిక్ సెంటర్లోని వైద్యులను అడగగా పొంతన లేని సమాధానం చెప్పడమే కాకుండా రెండు రోజుల్లో తగ్గిపోతుంది అంటూ మాట్లాడడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా తనకు ఎటువంటి ఇంజక్షన్ ఇచ్చారు అనేదాని పై వివరణ ఇవ్వండి అని వారు కోరగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమని పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో బాధితులు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే డయాగ్నస్టిక్ సెంటర్లో ఒకరికి ఇవ్వాల్సిన రిపోర్టులు మరొకరికి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. దీనిపైన డయాగ్నస్టిక్ సెంటర్ వారిని వివరణ కోరగా ప్రతి హాస్పిటల్లో సెంటర్లలో ఇలానే జరుగుతాయని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed