మీ పఠన నైపుణ్యాలు, వేగాన్ని అద్భుతంగా మెరుగుపర్చే 9 మార్గాలు!!

by Anjali |
మీ పఠన నైపుణ్యాలు, వేగాన్ని అద్భుతంగా మెరుగుపర్చే 9 మార్గాలు!!
X

దిశ, వెబ్‌డెస్క్: చదవడం(reading)లో పట్టు సాధించాలంటే వేగం అనేది తప్పనిసరిగా ఉండాలి. భావనలను సులభంగా అర్థం చేసుకోవడంలో, అధ్యాయాలను త్వరగా పూర్తి చేయడంలో, భాషపై మీకు ఎంత మంచి పట్టు ఉందో ప్రజలకు చూపడంలో అవి మీకు సహాయపడతాయి. కాగా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి నిపుణులు చెప్పిన 9 అద్భుతమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంపార్టెంట్ పాయింట్స్ వద్ద హైలైట్ చేయండి..

మీ పఠన వేగాన్ని మెరుగుపరచడానికి, అలాగే పెంచడానికి ఉత్తమ చిట్కాలలో ఒకటి ముఖ్యమైన వాటిని హైలైట్ చేయడం. మీరు ఏదైనా హైలైట్ చేసినప్పుడు, ఆ అంశం తొందరగా మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. అలాగే వీలైనంత త్వరగా దాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తారు.

పదాల సబ్‌వోకలైజేషన్‌ను తగ్గించండి

చిన్నప్పటి నుంచి గురువులు నేర్పని సాధారణ అలవాటు ఏమిటంటే.. గట్టిగా చెప్పే ముందు తలలో పెట్టుకుని చెప్పు అంటారు. ఇది పిల్లలకు మంచిదే అయినప్పటికీ.. మీరు పెరిగేకొద్దీ ఇది మిమ్మల్ని నెమ్మదిస్తుంది. కాబట్టి పదాలను మానసికంగా చెప్పకుండా దృశ్యమానంగా గుర్తించేలా మీ మనసుకు శిక్షణ ఇవ్వడం మేలు.

వాక్యాలపై పెన్ను లేదా వేలిని ఉంచండి..

మీరు ఏదైనా త్వరగా చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా మీ కళ్లు, మనస్సు దానిపై పెడుతారు. అలాగే చదివే అంశాలపై పెన్ను లేదా మీ వేలిని ఉపయోగించండని నిపుణులు చెబుతున్నారు. ఇది పఠనంపై దృష్టి పెట్టడానికి.. ఏకాగ్రతగా ఉండటానికి మీకు దోహదం చేస్తుంది.

పద సమూహం..

ఒక్కొక్కరు ఒక్కో పదాన్ని చదివి ఆ తర్వాత బిగ్గరగా చెప్పే రోజులు పోయాయి. ఈ విధంగా చదివితే పిల్లలకు మంచిదే అయినప్పటికీ.. మీరు పెద్దయ్యాక ఈ అలవాటు వదిలివేయడం బెటర్. పదాలను ఒకదాని తర్వాత ఒకటి సమూహపర్చండి.

మళ్లీ చదవకండి..

ఎప్పుడైనా సరే ముందుగా ఒక బుక్ తీసుకున్నాక.. దాన్ని క్రమంగా చదువుతూపోవాలి. ఒక వాక్యం చదివాక మళ్లీ దాన్నే చదువుతూ ఉండకూడదు. ఒకవేళ ఆ అలవాట కనుక ఉన్నట్లైతే.. దీన్ని వీలైనంత వరకు నివారించండి. అర్థం అస్పష్టంగా ఉన్నట్లైతే.. చదవడం మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్లీ రెండోసారి చదవడానికి ప్రయత్నించండి.

మీకు మీరే సమయపాలన కేటాయించుకోవాలి..

మీరు మీ పఠనాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీకు మీరే సమయపాలన అనేది ప్రాణదాతగా ఉంటుంది. మీకు మీరే 400 పదాలు లేదా పుస్తకం యొక్క పేజీని చదివేందుకు ట్రై చేయండి. టైమర్‌ని 3 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయం కోసం సెట్ చేసుకోండి. గడియారం టిక్ చేస్తున్నప్పుడు త్వరగా చదవడానికి అంతర్గత పుష్ ఉంది.

ప్రాక్టీస్ ముఖ్యం..

ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. సెలబస్ మొత్తం చదివాక.. కంప్లీట్ అయ్యిందని బుక్ పక్కకు పడేశారో ఇక అంతే సంగతి. మీరు అనుకున్న గమ్యానికి చేరాలంటే ఎంత పెద్ద ఎక్స్ఫర్ట్ అయినా సరే ప్రాక్టీస్ అనేది తప్పనిసరి.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

మీరు చదివేటప్పుడు ఎట్టిపరిస్థితిల్లోనూ ఫోన్ చేతిలో ఉంచుకోవద్దు. కేవలం చదవడంలోనే కాకుండా మరే ఇతర కార్యకలాపంలోనైనా ప్రజలు చేసే అతి పెద్ద తప్పులలో ఇది ఒకటి. కాగా ఫోన్‌ను దగ్గరగా ఉంచుకోవద్దు.

రీడింగ్ యాప్‌లను ఉపయోగించండి..

మీరు ఒక నెల లేదా రెండు నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే.. ఒక స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉంటే.. మీకు ఇష్టమైన టెక్స్ట్‌ను అప్‌లోడ్ చేయడానికి వేగాన్ని సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే స్పీడ్ రీడింగ్ యాప్‌ని ఎంచుకోండి. ఎంచుకున్న వేగం ప్రకారం పదాలు హైలైట్ అవుతాయి. దీంతో మీ రీడింగ్ ఈజీ అయిపోతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story