- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rent or Own House: ఇల్లు కట్టుకున్న వాడు హీరోనా లేక అద్దేకున్నవాడు హీరోనా?

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది అద్దెకు ఉంటారు. ఎందుకంటే, సొంతిల్లు ( own House ) కు టైం తీసుకుని ఎవరి హోదా తగ్గట్టు వారు కట్టుకుంటారు. ఇది వారి పరిస్థితులను బట్టి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న రోజుల్లో అద్దెకు ఉండే బదులు సొంత ఇల్లు బెటర్ అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇంకొందరు, అద్దె ఇల్లు బెటర్ అని అంటున్నారు. మరి, వీటిలో ఏది మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..
ఇల్లు కడితే రూ. 30 నుంచి రూ. 40 లక్షలు అవుతుంది. రూ. 8 వేల నుంచి రూ. 15 వేల అద్దె మాత్రమే వస్తుంది. ఇలా దీనికి వడ్డీ కూడా రాదు.. కొందరు అడ్వాన్స్ కింద కొందరు రూ15 వేలు రెంట్ అయితే మూడు నెలల అద్దె ఒకేసారి తీసుకుంటారు. మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే ఇల్లు పెద్దదిగా కట్టించి అద్దెకు ఇవ్వొచ్చు. నిర్మాణానికి సంబంధించిన వస్తువులు తక్కువ ధరలలో తీసుకుని, ఒక నాలుగు ఫ్లోర్ల భవనం నిర్మిస్తే మంచిది.. అప్పుడు, అద్దె రావడమే కాకుండా సొంతింటి కల కూడా నెరవేరుతుంది.
అయితే, నిపుణులు ఏం చెబుతున్నారంటే.. అద్దె ఇల్లే ( Rent house ) బెస్ట్ అని అంటున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాక టెన్షన్స్ ఎక్కువవుతాయి. లోన్ తీసుకుని కట్టిన వారైతే సరిగా ఏ పని చేయలేరు. వాళ్ళకి కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు కూడా ఇదే ఇదే మెదులుతుంది. ఆర్థికంగా డబ్బు సంపాదించాలంటే.. మీకు వచ్చే జీతంలో కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం, లేదా కొత్త భూములు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.
ఇంటికి పెట్టే ఖర్చు చూసుకుంటే.. మీరు పెట్టిన దానికి వడ్డీ కూడా రాదు.. అద్దెకు ఉంటూ కొన్నేళ్ళ తర్వాత, ఇల్లు కట్టుకోవాలంటే .. సగం డబ్బు ఇల్లు కి పెట్టి, మరి కొంత లోన్ కి వెళ్తే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన, కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి, రెంట్ ఇంట్లో వాళ్లే హీరోలు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.
SBI Amrit Kalash: ఆ స్కీములో పెట్టుబడికి ముంచుకువస్తోన్న ఆఖరు తేదీ..రాబడిపై కచ్చితమైన హామీ