- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రి ప్రేమంటే ఇదే.. ఒక చేతిలో బిడ్డ.. మరో చేత్తో రిక్షా హ్యాండిల్

దిశ, వెబ్ డెస్క్: కన్నతండ్రి ప్రేమ గురించి మాటల్లో చెప్పలేం. తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎల్లప్పుడూ ఆరాటపడుతుంటాడు. పైకి ఎంత కఠినంగా కనిపించినా మనసులో మాత్రం ప్రతి క్షణం తమ పిల్లల గురించే ఆలోచిస్తుంటాడు. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కాపాలా కాస్తాడు. అందుకే పిల్లల జీవితంలో నాన్న అంటే.. ఓ గర్వం, ఓ నమ్మకం, రియల్ హీరోగా ఉంటాడు. ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఫొటో చూస్తే .. తమ పిల్లల కోసం తండ్రి ఎంత కష్టపడుతాడో అర్థమవుతుంది.
నెల వయసున్న ఓ పసిపాపను ఒక చేతిలో ఎత్తుకుని, మరో చేతిలో రిక్షా హ్యాండిల్ పట్టుకుని రిక్షా తొక్కుతూ కనిపించాడు ఓ తండ్రి. రిక్షా తొక్కితే కానీ కడుపునిండదు. బిడ్డ పుట్టగానే భార్య చనిపోయింది. పసిపాపను చూసుకునేందుకు బంధువులెవరు లేకపోవటంతో ఆ తండ్రి చేసేదేం లేక తన బిడ్డను ఎత్తుకుని రిక్షా నడుపుతున్నాడు. ఇది చూసిన వారంతా 'అయ్యో పాపం! ఎంత కష్టం వచ్చింది' అని జాలిపడుతున్నారు. అయితే ఇది పాత ఫొటో అయినప్పటికీ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటూ కామెంట్లు పెడుతున్నారు. తండ్రి ప్రేమకు ఈ ఫొటో నిదర్శనం అంటూ మిమర్లు మీమ్స్ చేస్తున్నారు.