రజక సంఘం నాయకుడి మృతదేహానికి మంత్రి నివాళి

by Naveena |
రజక సంఘం నాయకుడి మృతదేహానికి మంత్రి నివాళి
X

దిశ, కొల్లాపూర్: పట్టణంలో ఏడో వార్డుకు చెందిన రజక సంఘం నాయకుడు సీహెచ్ చిన్న మహంకాళి భౌతిక కాయానికి ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహంకాళి బ్రెయిన్ ట్యూమర్ తో శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వారి ఇంటికి వెళ్లి.. మహంకాలి కుటుంబ సభ్యులకు, ఆ ధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ కౌన్సిలర్లు బరిగేలా రాముడు యాదవ్, సిబ్బెది నర్సింహరావు,వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుపుల నర్సింహ,సన్నీ,బావాయి పల్లి మాజీ సర్పంచ్ నక్క వేణు గోపాల్ యాదవ్,రెడ్డి సత్యం, కార్యకర్తలు జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed